కరోనా ప్రభావం తగ్గాకే ‘నారప్ప’ షూటింగ్ !

Published on Jul 6, 2020 11:03 pm IST


విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గాకే ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ అసురన్ సినిమాని తెలుగులో కొన్ని మార్పులు చేసి తీస్తున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో స్క్రిప్ట్ వర్క్ చేశారట. ముఖ్యంగా వెంకటేష్ టైమింగ్ కి తగ్గట్లు కొన్ని కొత్త సీన్స్ ను రాశారట. వెంకటేష్ క్యారెక్టర్ సీరియస్ గా సాగిన.. ఆ సీరియస్ నెస్ లో వెంకటేష్ చేసే యాక్టివిటీస్ తో ఫన్ జనరేట్ అయ్యేలా శ్రీకాంత్ అడ్డాల కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

వెట్రిమారన్ తెరకెక్కించ ఈ యాక్షన్ డ్రామా తమిళనాట సంచలన విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక వెంకీ మరో రీమేక్ లో కూడా నటించబోతున్నాడని మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ లో నటించడానికి వెంకీ ఇంట్రస్ట్ గా ఉన్నారని వస్తోన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ప్రస్తుతం వెంకీ నారప్ప తప్ప మరే సినిమా చెయ్యట్లేదు.

సంబంధిత సమాచారం :

More