‘మహర్షి’లో మహేశ్ ను మార్చేది అతనే !

Published on May 7, 2019 8:56 pm IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో మే 9న అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న ‘మహర్షి’ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు మూడు వేర్వేరు పాత్రల్లో మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తోనూ వెరీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా అమాయకుడైన స్టూడెంట్ గా పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా అల్లరి నరేష్ పాత్ర కాస్త ఎమోషనల్ గా ఉంటుందట. అల్లరి నరేష్ పాత్ర చావు వల్లే, మహేష్ పాత్ర గమనం మారుతుందని.. అప్పుడే యూఎస్ నుండి ఇండియాకి తిరిగొస్తాడని.. చివరకి తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా, తాను అనుకున్నది సాధిస్తాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పివిపి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More