నాని చేతుల మీదుగా ‘ఎవరు’ ట్రైలర్ !

Published on Aug 4, 2019 11:24 am IST

వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా క‌సండ్ర హీరోయిన్‌ గా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. కాగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రేపు ఉదయం 10 గంటల 30 నిముషాలకు న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుంది. ఈ మేరకు ఈ చిత్ర హీరో అడవి శేష్ సోషల్ మీడియాలో పోస్టర్ ను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

ఇక ఎవరు సినిమా విడుదల తేదిని ఆగష్టు 23న నుంచి వారం రోజుల ముందుకు మార్చి.. సినిమాను ఆగష్టు 15నే రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా.. వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీవీపీ అండ్ అడవి శేష్ కాంబినేషన్ లో గతంలో క్షణం అనే హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :