సిట్ ముందుకు మరో టాలీవుడ్ హీరో !
Published on Jul 24, 2017 11:25 am IST


డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ అధికారులు జరుపుతున్న విచారణ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుబ్బరాజు, శ్యామ్ కె నాయుడు, తరుణ్ వంటి ప్రముఖుల్ని విచారించిన ప్రత్యేక విచారణ బృందం ఈరోజు మరొక హీరో నవదీప్ ను విచారించనుంది. ఈ మేరకు నోటీసులు అందుకున్న నవదీప్ కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి హాజరయ్యారు.

డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్టైన జాక్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నట్లు నవదీప్ ఆరోపణలు ఎదుర్కుంటుండగా సిట్ ఇదే అంశంపై నవదీప్ ను విచారించనుంది. ఇప్పటి వరకు జరిగిన నలుగురి విచారణలో పలు కీలక ఆధారాలను రాబట్టిన సిట్ టీమ్ ఈరోజు నవదీప్ ద్వారా ఎలాంటి విషయాల్ని రాబడుతుందో చూడాలి. ఈరోజుటితో కలిపి మొత్తం 5 మంది సినీ వ్యక్తుల విచారణ పూర్తవుతుండగా మరో 7 మందిని విచారించాల్సి ఉంది.

 
Like us on Facebook