నవరస నుండి సరికొత్త పోస్టర్ విడుదల!

Published on Jul 28, 2021 1:44 pm IST


మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న నవరస పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ ను మొత్తం తొమ్మిది ఎపిసోడ్ లతో చిత్రీకరించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన పోస్టర్లు, ఇంట్రడక్షన్ వీడియో, ట్రైలర్ లతో పాటుగా, కొన్ని పాటలు సైతం విడుదల అయ్యాయి. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన సరికొత్త పోస్టర్ ను నవరస టీమ్ విడుదల చేయడం జరిగింది.

నవరస పోస్టర్ 1 అంటూ ఎథిరి పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్, రేవతి, విజయ్ సేతుపతి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ సమర్పణ లో తొమ్మిది ఎపిసోడ్ లలో తొమ్మిది ఎమోషన్స్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు టీమ్. అయితే ఈ ఎథిరి కి బెజొయ్ నంబియార్ దర్శకత్వం వహించడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 6 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

సంబంధిత సమాచారం :