డ్రగ్స్ వివాదం గురించి హీరో ఏమన్నాడో తెలుసా..!!
Published on Jul 15, 2017 12:30 pm IST


టాలీవుడ్ ని డ్రగ్స్ వివాదం కుదిపేస్తోంది. ఈ వివాదం లో పలువురి సినీప్రముఖులు పేర్లు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. హీరో నవదీప్ పై కూడా డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి. దీనితో నవదీప్ ఈ వివాదంపై తన వాదనని వినిపించాడు.

డ్రగ్స్ వివాదంలో తనని ఇరికిస్తున్నారని నవదీప్ తెలిపాడు. కానీ తాను విచారణలో పోలీస్ లకు సహకరిస్తానని నవదీప్ తెలిపాడు. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా నిరూపించుకుంటానని అన్నాడు. గతం లో కూడా కొన్ని వివాదాల నేపథ్యం లో నవదీప్ అరెస్ట్ అయ్యాడు.

 
Like us on Facebook