బెల్లంకొండ సినిమాలో నవదీప్ !

బెల్లంకొండ సినిమాలో నవదీప్ !

Published on Mar 26, 2018 2:28 PM IST


యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం నూతన దర్శకుడు శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. కొంత షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో నటుడు నవదీప్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడట. గతంలో కూడ నవదీప్ రానా చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే శ్రీవాస్ డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘సాక్ష్యం’ చిత్రం మే 11న విడుదలకానుంది.

తాజా వార్తలు