నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Published on Dec 26, 2021 9:42 pm IST

వరస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం నవీన్ హీరోగా యువీ క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రంలో డిసెంబర్ నెలాఖరు నుంచి జాయిన్ కానున్నారు నవీన్. ఈ క్రమంలోనే డిసెంబర్ 26న నవీన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మరో ప్రధాన పాత్రలో అనుష్క శెట్టి నటిస్తున్నారు. అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇప్పుడు నవీన్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఈయన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. త్వరలోనే షూటింగ్‌లోనూ అడుగు పెట్టనున్నారు నవీన్.

సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్‌కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. అలాగే నవీన్ పొలిశెట్టికి హీరోగా మూడో సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి, 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేయబోతున్నారు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను మహేష్ బాబు అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు అనే విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :