నవీన్ పోలిశెట్టి చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్స్..!

Published on Aug 4, 2021 2:20 am IST

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి “జాతి రత్నాలు” సినిమాతో మంచి సక్సెస్ అదుకున్నాడు, త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేయబోతున్నాడు. ఇది పక్కన పెడితే కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు ఎదురుకుంటున్న వారికి ఈ జాతిరత్నం అండగా నిలుస్తున్నాడు. అయితే తాజాగా ఉద్యోగం కోల్పోయిన సమీర్‌ అనే యువకుడికి నవీన్ పోలిశెట్టి ట్వీట్‌తో జాబ్‌ ఇప్పించాడు.

కరోనా కారణంగా జాబ్ పోయి సమీర్ అనే యువకుడు బాధ పడుతున్నాడని తెలియగానే నవీన్ ఆ యువకుడి వివరాలను ట్వీటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఎవరైనా ఉద్యోగం ఉంటే ఆ యువకుడికి ఇవ్వమని కోరాడు. అయితే నవీన్ ట్వీట్‌కు స్పందించిన ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ ఆ యువకుడికి స్టోర్ మేనేజర్‌గా ఉద్యోగాన్ని కల్పించారు. అయితే ఇదే విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేసిన సమీర్‌కు వచ్చిన ఆఫర్‌ లెటర్‌ని నవీన్ పోస్ట్‌ చేశాడు. అంతేకాదు సమీర్ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన నెటిజన్స్ చరణ్, సౌమ్యలకు థ్యాంక్స్ చెబుతూ, త్వరలోనే ఈ స్టోర్‌కు తాను వెళ్తానని చెప్పుకొచ్చాడు అయితే నవీన్ పోలి శెట్టి చేసిన పనికి నెటిజన్స్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. .

సంబంధిత సమాచారం :