షూట్ రెడీ అవుతున్న యంగ్ హీరో !

Published on Jul 16, 2019 12:02 am IST

న‌వీన్ పొలిశెట్టి హీరోగా స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌` చిత్రం డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఈ సక్సెస్ తో న‌వీన్ పొలిశెట్టి హీరోగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు. ఇప్పటికే వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో నవీన్ పొలిశెట్టి ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. స్వప్న సినిమాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రం కూడా మంచి కంటెంట్ బేస్డ్ మూవీ అట.

కాగా ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఎవరు డైరెక్షన్ చేస్తారో త్వరలోనే ఎనౌన్స్ చేస్తారట. ఇక న‌వీన్ పొలిశెట్టి ఈ సినిమాతో పాటు `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌` నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా ప్రొడక్షన్ లో మరో సినిమా చెయ్యడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా మరో ఇద్దరు నిర్మాతలు కూడా నవీన్ పొలిశెట్టితో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నారట. మొత్తానికి ఒక్క హిట్ దెబ్బకి వరుసగా అవకాశాలు వస్తున్నాయిగా.

సంబంధిత సమాచారం :

X
More