అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన అమితాబ్‌ మనవరాలు !

Published on Aug 2, 2021 1:32 am IST


అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలి సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటూ తనకు సంబంధించిన అప్ డేట్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది నవ్య. అయితే తాజాగా నవ్య ఓ అందమైన ఫొటో షేర్‌ చేసింది. ఆ ఫోటో పై నెటిజన్‌ ఓ కామెంట్ చేస్తూ.. ‘‘మీరు చాలా అందంగా ఉన్నారు. హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ప్రయత్నం చేయండి’ అని పోస్ట్ చేశాడు.

కాగా ఆ పోస్ట్ కి నవ్య సమాధానం చెబుతూ ‘మీ అభిమానానికి థ్యాంక్స్‌. అందమైన మహిళలు బిజినెస్‌ లోనూ రాణించగలరు’ అని సమాధానమిచ్చింది. మొత్తానికి తనకు ఏది ఇంట్రెస్టో నవ్య తెలివిగా చెప్పింది. ఇక ఆమె సమాధానికి బిగ్‌బీ నవ్యను ప్రశంసించారు. ఇప్పటికే నవ్య ‘ఆరా హెల్త్‌’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. నవ్య ఆరోగ్యం, పరిశుభ్రత విషయాల్లో మహిళలకు సహకరిస్తుంది.

సంబంధిత సమాచారం :