బ్రాండ్ ప్రమోషన్ కోసం స్టార్ హీరోయిన్స్

Published on Oct 22, 2019 7:46 pm IST

కత్రినాకైఫ్‌,లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఓ బ్రాండ్ ప్రమోషన్ కొరకు కలిసి నటించారు. ముంబైలో జరిగిన ఈ షూటింగ్ సంబందించిన వీడియోలు కత్రినా ఖైఫ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. కాగా కత్రినా ప్రస్తుతం వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఆమె సొంతంగా ‘కే బై కత్రినా’ అనే పేరుతో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌ ప్రచారం కోసం నయనతారతో కలిసి వీడియో చేయడం జరిగింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నాయన తార తన బ్రాండ్ ప్రమోషన్ కి చాలా ఉపయోగపడతారని భావించిన కత్రినా ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ‘సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ తన బ్రాండ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయికు వచ్చి వీడియో షూట్‌లో పాల్గొన్నందుకు నయనతారకు ధన్యవాదాలు’ అని కత్రినా తెలిపారు.

ఇటీవల విడుదలై మంచి విజయం అందుకున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా చేసిన నయనతార ,విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘బిగిల్‌’ సినిమాతోపాటు రజనీకాంత్‌ ‘దర్బార్‌’ సినిమాలో కూడా నటించారు . బిగిల్ మూవీ రేపు దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా తమిళ మరియు తెలుగు భాషలలో విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More