
అందాల భామ నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమా మయూరిలో నటిస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ ని అశ్విన్ సర్వనన్ తెరకెక్కించాడు. తమిళ నటుడు ఆరి ముఖ్యపాత్ర పోషించాడు.
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ అనువాద హక్కులను సొంతం చేసుకున్నాడు. త్వరలో ఆడియో విడుదలకానుంది. మరిన్ని వివరాల కోసం మా సైట్ ని ఫాలో అవుతూవుండండి.

