కమల్ హాసన్ తో పోటీపడనున్న నయన తార !

కమల్ హాసన్ తో పోటీపడనున్న నయన తార !

Published on Jul 14, 2018 9:35 AM IST

kamal nayan

ప్రముఖ నటి నయన తార తమిళ భాషలో నటిస్తున్న చిత్రం ‘కొలమావు కోకిల’ (కోకో). ఈ చిత్రంలో ఆమె డ్రగ్స్ అమ్మేయువతి పాత్రలో నటిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియో , ట్రైలర్ చిత్రం ఫై ఉన్న అంచనాలను పెంచేశాయి. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నెల్సన్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 10 న విడుదలకానుంది.

ఇక అదే రోజు లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘విశ్వరూపం 2’ కూడా ప్రేక్షకులముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో నయనతార బాక్సాఫిస్ వద్ద కమల్ కు ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు