వైఎస్ఆర్ బయోపిక్లో నయనతార, కీర్తి సురేష్ !


రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు మహిత్ రాఘవ సినిమా తెయ్యబోతున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ పులివెందుల ప్రాంతంలో లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నారు. మే నుండి ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. సంగీత దర్శకుడు కె ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తుండగా, సత్యాన్ సూర్యాన్ సినిమాటోగ్రఫి అందించబోతున్నాడు.

జగన్ పాత్రలో హీరో సూర్య కనిపించబోతున్నాడు. సూర్య సరసన కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో విజయమ్మ పాత్రలో నయనతార నటించే అవకాశాలు ఉన్నాయి. ‘ఆనందో బ్రహ్మ’ సినిమా తరువాత దర్శకుడు మహిత్ రాఘవ చెయ్యబోతున్న సినిమా ఇదే. మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.