
టాలీవుడ్ లో తిరిగి అడుగుపెట్టాక వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న భామ నయనతార. తాజా సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ తన తాజా తమిళ చిత్రం ‘తిరుణాల్’ షూటింగ్ ప్రారంభించింది.
రామ్నాద్ దర్శకత్వంలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ కుంబకోణంలో జరుపుకుంటుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నయనతార సరసన జీవా నటిస్తున్నాడు. శ్రీకాంత్ దేవా సంగీత దర్శకుడు. నయన్ త్వరలో సూర్య సరసన మాస్ సినిమాలో సైతం నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క మరిన్ని వివరాల కోసం మా సైట్ ని చూస్తూ వుండండి..

