ప్రేమా.? పెళ్ళా.? అవన్నీ వట్టి ట్రాష్ అన్న నయనతార

ప్రేమా.? పెళ్ళా.? అవన్నీ వట్టి ట్రాష్ అన్న నయనతార

Published on May 18, 2015 6:00 PM IST

Nayanatara
రెండు సార్లు ప్రేమలో పడింది, అందులో ఒకసారి ఏకంగా పెళ్లి దాకా వెళ్ళింది, కానీ ఫైనల్ గా పెళ్లి కూడా కాన్సల్.. ఇలా ప్రేమ, పెళ్లి అనే రెండు విషయాల్లోనూ చేదు అనుభవాన్నే ఎదుర్కున్న హీరోయిన్ నయనతార. దాంతో ప్రేమ, పెళ్ళికి పుల్ స్టాప్ పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన ఈ కేరళ కుట్టి వరుసగా హిట్ సినిమాలలో నటిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని తన ఖాతాలో వేసుకుంటోంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రేమలో ఉందని, తనని త్వరలోనే సీక్రెట్ గా పెళ్లి చేసుకోనుందనే వార్తలు సౌత్ ఇండియా మీడియాలో వినిపిస్తున్నాయి.

రోజు రోజుకీ ఎక్కువైపోతున్న ఈ పుకార్లకి నయనతార పుల్ స్టాప్ పెట్టేసింది. ‘పెళ్లి పై వస్తున్న పుకార్లలో అస్సలు నిజం లేదు. ప్రస్తుతం నా లైఫ్ లో ఉన్న నా వర్క్ మాత్రమే. ఎలాంటి బేస్ లేకుండా వచ్చే వార్తలని మీడియా ప్రచారం చేస్తోంది. ఆ వార్తల్లో నిజం లేదు. ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది చాలా స్పెషల్.. అది జరిగినప్పుడు కచ్చితంగా నేనే అందరికీ తెలియజేస్తానని’ నయనతార ఓ ప్రముఖ సోషల్ నెట్వర్క్ వారికి తెలియజేసింది.

ప్రస్తుతం నయనతార విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో ‘నానుం రౌడీ తాన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి, సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకి హీరోయిన్ గా నయనతారని ఎంపిక చేసే పనిలో ఉన్నారు.

తాజా వార్తలు