‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘రాజా రాణి’ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన అందాల భామ నయనతార వరుస హిట్స్ అందుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్స్ ని తన ఖాతాలో వేసుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ సినిమాలో హీరోయిన్ గా నయనతారని అప్రోచ్ అయినట్లు, తను కూడా సముఖతగా ఉన్నట్లు కొద్ది రోజుల క్రితమే తెలియజేశాం. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి నయనతార సైన్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆ క్రేజీ ప్రాజెక్ట్ హీరో మరెవరో కాదు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కావడం విశేషం. డైరెక్టర్ పిఏ రంజిత్ ఈ సినిమాకి నయనతార అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఆమెని తీసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకూ వయసుకి సంబంధం లేని పాత్రలు చేసిన రజినీకాంత్ ఈ విభిన్న కథలో తన వయసుకు తగ్గా పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే రజినీకాంత్ – నయనతార కలిసి చంద్రముఖి, కథానాయకుడు సినిమాల్లో కలిసి నటించారు. అంతే కాకుండా శివాజీ సినిమాలో నయనతార ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. మళ్ళీ వీరి కాంబినేషన్ చూడటానికి బాగుంటుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


