ప‌దేళ్ల త‌రువాత క‌లిసిన న‌య‌నతార – న‌జ్రియా

ప‌దేళ్ల త‌రువాత క‌లిసిన న‌య‌నతార – న‌జ్రియా

Published on Jun 24, 2024 11:00 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార ప్ర‌స్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆమె పర్స‌న‌ల్ లైఫ్ లోనూ ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా బిజీగా ఉంటున్నారు. అయితే, సోష‌ల్ మీడియాలో మాత్రం న‌య‌న్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానుల‌ను అల‌రిస్తోంది.

అయితే, తాజాగా న‌య‌న‌తార మ‌రో న‌టి న‌జ్రియా ఫహాద్ ను క‌లుసుకుంది. దాదాపు ప‌దేళ్ల త‌రువాత వీరిరువురు క‌లుసుకున్నారు. ‘రాజా రాణి’ సినిమాలో న‌టించిన ఈ ఇద్ద‌రు ఇప్పుడు మ‌ళ్లీ ఇలా ఒకే ఫ్రేంలో క‌నిపించ‌డంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా, న‌య‌న‌తార‌తో పాటు ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ఉండ‌గ.. న‌జ్రియాతో పాటు ఆమె భ‌ర్త ఫ‌హాద్ ఫాజిల్ కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చెక్క‌ర్లు కొడుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు