లేటెస్ట్ : NBK 107 మూవీ నుండి షాకింగ్ అప్ డేట్ … ??

Published on Jul 7, 2022 5:41 pm IST

నందమూరి బాలకృష్ణ కెరీర్ 107 వ సినిమా ప్రస్తుతం వరుస సక్సెస్ ల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ అదిరిపోయే పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి సూపర్ గా రెస్పాన్స్ అందుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ప్రఖ్యాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఇటీవల శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్, హఠాత్తుగా బాలకృష్ణకి కరోనా పాజిటివ్ కారణంగా కొన్నాళ్ళు వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా నుండి పూర్తిగా కోలుకున్న బాలకృష్ణ ఈ నెల 9 నుండి మళ్ళి రెగ్యులర్ గా షూట్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ మూవీ టీమ్ లో కీలక సబ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో షూట్ మరికొన్నాళ్లు వాయిదా పడనుందట. ఈ సినిమాకి సంబంధించి ఇది ఒకరకంగా షాకింగ్ న్యూస్ అని, అలానే షూట్ లో సభ్యులు కోలుకున్న అనంతరం మళ్ళి షెడ్యూల్ ని వీలైనంత త్వరలో ప్రారంభించేలా యూనిట్ ప్లాన్ చేస్తోందట. మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉందట.

సంబంధిత సమాచారం :