నందమూరి బాలయ్య 102వ చిత్రం ప్రారంభం!

3rd, August 2017 - 11:32:49 AM


నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం సీనియర్ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ కొద్దిసేటి క్రితం అధికారికంగా ప్రారంభమైంది. సీ కల్యాణ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంబోత్సవంలో ముహూర్తపు షాట్ కు దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణాలతో పాటు పంజాబ్ చిత్ర సీమలో టాప్ హీరోగా ఉన్న నటుడు విలన్ గా నటించనున్నాడు. చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్ క్రిష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అంబిక కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ కల్యాణ్ మాట్లాడుతూ, నెలాఖరు వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో, ఆపై తమిళనాడులోని కుంభకోణంలో షూటింగ్ చేస్తామని, ఆ తరువాత వైజాగ్, హైదరాబాద్ లో సినిమాను పూర్తి చేసి, సంక్రాంతి బరిలో నిలుపుతామని అన్నారు. ఈ సినిమా అటు కె. ఎస్ రవికుమార్ స్టైల్ ఇటు బాలయ్య స్టైల్ లో సరికొత్తగా రూపొందిస్తున్నట్లు సమాచారం.