బాలక్రిష్ణ 102 వ చిత్రం మోషన్ పోస్టర్ ఎప్పుడంటే !
Published on Oct 27, 2017 5:00 pm IST

ఇటీవలే ‘పైసా వసూల్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం తన 102వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రం తాలూకు రెండు షెడ్యూళ్లు ముగిశాయి. పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉడనున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో బోలెడు అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి ‘జై సింహ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఈ టైటిల్ విన్న అభిమానులు సినిమాలో బోలెడంత యాక్షన్ కంటెంట్ ఉంటుందని, ఈసారి సాలిడ్ హిట్ ఖాయమని అనుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు కూడా ముహూర్తం ఖరారైంది. నవంబర్ 1వ తేదీన పోస్టర్ రిలీజ్ కానుంది. నయనతార ప్రధాన కథానాయకిగా నటిస్తుండగా మలయాళ హీరోయిన్ నటాషా దోషి, హరిప్రియలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంభందించిన అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసి జనవరి 12న భారీగా విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్. ‘కంచే’ సినిమాకు సంగీతం అందించిన చిరతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సికే.ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook