కలల సుందరి కోసం ‘నీలాంబరం’ అంటూ వచ్చేసిన “ప్రేమ్ కుమార్”..!

కలల సుందరి కోసం ‘నీలాంబరం’ అంటూ వచ్చేసిన “ప్రేమ్ కుమార్”..!

Published on Feb 5, 2022 8:01 PM IST

సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్ హీరోయిన్‌గా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి.పతాకంపై సరళ పన్నీరు సమర్పణలో శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రం “ప్రేమ్ కుమార్”. ఈ చిత్రం ద్వారా అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ ఇతర తారాగణం. అయితే నేడు ఈ సినిమాలో తొలి పాట ‘నీలాంబరం..’ను విడుదల చేశారు.

“వచ్చేసింది వచ్చేసింది! ‘నీలాంబరం..’ పాట వచ్చేసింది. ప్రేమ్ కుమార్ గారు తన కలల సుందరి గురించి పాటలు కూడా మొదలెట్టేసాడు” అని చిత్రబృందం తెలియజేసింది. కాగా ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందించాడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల అవుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ ఈ రోజు విడుదల చేసిన ‘నీలాంబరం’ పాటకు అద్భుత స్పందన లభిస్తోంది. మంచి మెలోడీ అని శ్రోతలు చెబుతున్నారు. త్వరలో మిగతా పాటలను విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇదొక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని అన్నారు.

దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ “ప్రేమ్ కుమార్ పాత్రలో సంతోష్ శోభన్ కనిపిస్తారు. పీటల మీద పెళ్లి ఆగితే.. ప్రేమ్ కుమార్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాలు.. సినిమాలో అన్నీ ఉన్నాయి. ‘నీలాంబరం…’ పాట అందరినీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు