ఉత్కంఠ భరితంగా రెజీనా “నేనేనా” ట్రైలర్!

Published on Sep 14, 2021 7:31 pm IST


రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలో కార్తిక్ రాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం నేనేనా. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం లో అక్షర గౌడ, వెన్నెల కిషోర్, జేపి, తాగుబోతు రమేష్, జీవా రవి, మైకేల్, రాచపూడి కౌశిక్, యోగి, రవి రాజా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల అయింది.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా కొనసాగింది. 100 ఏళ్ల కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ను చిత్రం లో చూపించనున్నారు. మర్దర్లు, క్రైమ్, హార్రర్ జోనర్ లో వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రాన్ని ఆపిల్ స్టూడియోస్ వారు నిర్మించడం జరిగింది. వీలైన త్వరగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :