మే 24న `నేను లేను` !

మే 24న `నేను లేను` !

Published on May 7, 2019 12:27 AM IST

ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ దర్శకత్వంలో ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేను లేను”. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రంలో హ‌ర్షిత్ హీరోగా న‌టిస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చెసిన ఈ చిత్రం ట్రైలర్ 7.5 మిలియన్ వ్యూస్ ను అందుకుంది.

ఈ చిత్రం గురించి ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ -“ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. అందరు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. ‌
మే 24న సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నిర్మాత : సుక్రి కుమార్, రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు