యూఎస్‌లో హాఫ్ మిలియన్ దాటిన ‘నేను లోకల్’!
Published on Feb 5, 2017 11:32 am IST


వరుస విజయాలతో తిరుగన్నదే లేకుండా దూసుకుపోతోన్న హీరో నాని, గత శుక్రవారం ‘నేను లోకల్’ అంటూ వచ్చి మరోసారి మెప్పిస్తోన్న విషయం తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, ఆయనకు మంచి క్రేజ్ ఉన్న మార్కెట్స్‌లో ఒకటైన యూఎస్‌లో సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది. శుక్రవారం వరకూ 353కే డాలర్లు వసూలు చేసిన సినిమా, శనివారం రాత్రి 11గంటల లోపే 500కే మార్క్‌ను దాటేసింది. ఇక ఆదివారం రోజున కూడా కలెక్షన్స్ ఇదే జోరులో ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది.

దీంతో నేను లోకల్ యూఎస్‌లో 1 మిలియన్ సులువుగా దాటేస్తుందని చెప్పొచ్చు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. అన్నిచోట్లా ఆదివారం రోజు కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో ఇలాగే నిలబడితే నానికి మరో పెద్ద హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పొచ్చు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

 
Like us on Facebook