‘నేను లోకల్’ ఫస్ట్ వీకెండ్ యూఎస్ కలెక్షన్స్!


వరుస విజయాలతో తిరుగన్నదే లేకుండా దూసుకుపోతోన్న హీరో నాని, ఫిబ్రవరి 3న ‘నేను లోకల్’ అంటూ వచ్చి మరోసారి మెప్పిస్తోన్న విషయం తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, ఆయనకు మంచి క్రేజ్ ఉన్న మార్కెట్స్‌లో ఒకటైన యూఎస్‌లో సూపర్ ఓపెనింగ్స్ సాధించింది. ఆదివారం పూర్తయ్యేసరికి యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘నేను లోకల్’ 750కే డాలర్లు (సుమారు 5.04కోట్ల రూపాయలు) వసూలు చేసింది.

దీంతో నేను లోకల్ యూఎస్‌లో 1 మిలియన్ త్వరలోనే చేరుకుంటుందని ఆశించొచ్చు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఈ వారం వస్తోన్న ‘సింగం 3’, ‘ఓం నమో వెంకటేశాయ’లతో పోటీలో నిలబడితే నేను లోకల్ నానికి మరో పెద్ద హిట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు.