మరికొన్ని చిత్రాల డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

మరికొన్ని చిత్రాల డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

Published on Jan 16, 2024 5:47 PM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్, ఇటీవల పలు తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క దేవర, అల్లు శిరీష్ బడ్డీ, విశ్వక్ సేన్ యొక్క గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, నందమూరి బాలకృష్ణ మరియు బాబీ కాంబినేషన్ లో వస్తున్న NBK 109 చిత్రాల డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్. అయితే మరి కొన్ని తెలుగు చిత్రాలు కూడా ఇప్పుడు లిస్ట్ లో ఉన్నాయి.

యంగ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ప్రొడక్షన్స్ నంబర్ 12, GA 2 పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 9, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్త బ్యానర్ పై నిర్మిస్తున్న సిద్దు జొన్నలగడ్డ చిత్రం SVCC37, సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ చిత్రం, పుష్ప 2 ది రూల్ చిత్రాలు లిస్ట్ లో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు