ప్రభాస్ “ఆదిపురుష్”కు మామూలు ప్లానింగులు లేవా?

Published on Dec 2, 2020 7:05 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పలు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించనున్న ఈ భారీ ఇతిహాస చిత్రంపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని ఎలాంటి హంగులు కావాలో అన్నిటినీ మేళవించి అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ కూడా వచ్చింది.

అలాగే ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ నెవర్ బిఫోర్ గా అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు అందుకు సంబంధించే మరిన్ని గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి గాను హాలీవుడ్ ప్రముఖ వి ఎఫ్ ఎక్స్ నిర్మాణ సంస్థ వెటా డిజిటల్స్ వారితో పని చేస్తారని టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ వీరితో టై అప్ అయితే ఒక అదిరిపోయే విజువల్ ట్రీట్ గ్యారంటీ అని చెప్పాలి.

ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ మోత మోగించిన “అవతార్”, “అవెంజర్స్ ఎండ్ గేమ్” ఇలా ఎన్నో అదిరిపోయే హాలీవుడ్ చిత్రాలకు విజువల్స్ అందించిన వీరు ఆదిపురుష్ కు పని చేస్తున్నట్టయితే ఇది మామూలు ప్లానింగ్ కాదని చెప్పాలి. మరి ఇది ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.ఈ సినిమా విషయంలో 1000 కోట్లు వరకు అయినా పెట్టడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు మరి అలాంటప్పుడు ఖచ్చితంగా టై అప్ అయినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More