వెంకటేష్, తేజ సినిమాకు కొత్తవాళ్ళు ఎంపిక అయ్యారు !

వెంకటేష్, తేజ సినిమాకు కొత్తవాళ్ళు ఎంపిక అయ్యారు !

Published on Jan 27, 2018 2:47 PM IST

తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటించబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలని దర్శకుడు తేజ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 25 నుండి ఆడిషన్స్ జరిగాయి.

తాజా సమాచారం మేరకు ఈ మూడు రోజుల్లో జరిగిన ఆడిషన్స్ లో చాలా మంది కొత్త నటి,నటులు ఎంపిక అయినట్లు తెలుస్తోంది. వెంకటేష్ వంటి టాప్ హీరో సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టమే. ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్స్ ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. నారా రోహిత్ ఈ సినిమాలో నటించబోతునట్లు తేజ ఇటీవల ఫేస్ బుక్ లో వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు