బజ్..’సర్కారు’ నుంచి మాస్ ట్రీట్ అప్పటికి ఫిక్స్ అయ్యిందా?

Published on Sep 7, 2021 7:01 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. వింటేజ్ మహేష్ ని ప్రెజెంట్ చేస్తూ అదిరే టేకింగ్ తో దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రం నుంచి మరో మోస్ట్ అవైటెడ్ అప్డేట్ కోసం అభిమానులు సహా ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం..

మహేష్ మరియు థమన్ ల కాంబోలో ఇప్పటికే సాలిడ్ ట్యూన్స్ ఉన్నాయి అందుకే దీనిపై ప్రత్యేక అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా మాస్ ట్రీట్ కి ముహూర్తం కుదిరినట్టుగా బజ్ వినిపిస్తుంది. రానున్న దసరా మహోత్సవం కానుకగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఉండొచ్చని టాక్. మరి దీనిపై అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. ఎలాగో మేకర్స్ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ కి ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడే వచ్చే అవకాశం లేకపోలేదు.. మరేం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :