పవన్ మాస్ రీమేక్ కి కొత్త సినిమాటోగ్రాఫర్ దొరికేసారా.?

Published on Jul 22, 2021 1:59 pm IST

ప్రస్తుతం స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చి తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. దీనితో ఆల్రెడీ షూట్ పెట్టాల్సి ఉన్న చిత్రాల షూట్ మరింత ఆలస్యం అవుతున్నాయి. అయితే వాటిలో మాస్ రీమేక్ “అయ్యప్పణం కోషియం” రీమేక్ మొదటగా స్టార్ట్ కావాల్సి ఉంది.

ఈ జూలై నెలలోనే గత 14న అలా మొదలు కావాల్సి ఉన్న ఈ చిత్రం ఇప్పటికీ కూడా స్టార్ట్ కాలేదు. అయితే ఈ చిత్రం బ్రేక్ సమయంలోనే ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెళ్ళ పలు కారణాల చేత సినిమా నుంచి బయటకు వెళ్లిపోయారన్న టాక్ తెలిసిందే. మరి ఆయన స్థానంలో ఈ చిత్రానికి మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది.

తమిళ్ మరియు అనేక బాలీవుడ్ చిత్రాలకు తన వర్క్ అందించిన రవి కె చంద్రన్ ఈ సినిమాకి వర్క్ చేయనున్నట్టుగా తాజా బజ్. మరి ఆయన లిస్ట్ లో ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేస్తున్న భారీ చిత్రం రామ్ సేతు, కోలీవుడ్ లో “7త్ సెన్స్” ఎన్నో సినిమాలు ఇప్పటి వరకు చేశారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

సంబంధిత సమాచారం :