God Of War: తారక్ ‘గాడ్ ఆఫ్ వార్’కి కొత్త సమస్య.. మేకర్స్ స్పందిస్తారా?

God Of War: తారక్ ‘గాడ్ ఆఫ్ వార్’కి కొత్త సమస్య.. మేకర్స్ స్పందిస్తారా?

Published on Jul 5, 2026 4:56 PM IST

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమా డ్రాగన్ తర్వాత చేయనున్న నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ నే “గాడ్ ఆఫ్ వార్”. దర్శకుడు త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్న ఈ భారీ స్కేల్ డ్రామా అతి త్వరలోనే మొదలు కానుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎట్టకేలకి అనౌన్స్ కావడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా మొదలు కాకుండా కొన్ని ఊహించని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటిగా సినిమా అనౌన్స్ చేసినపుడే తమిళ ఆడియెన్స్ మా ‘మురుగన్’ ఉత్తర భారదేశానికి చెందినవాడు కాదు అంటూ స్టార్ట్ చేశారు. ఇక ఇదిప్పుడు రాజకీయ కోణంలోకి కూడా మారిపోయింది.

తమిళ నాట ప్రముఖ రాజకీయ పార్టీ ఎన్టీకే (NTK) అధినేత సీమన్ వార్న్ చేయడం కొత్త చర్చకి దారి తీసింది. చిత్రీకరణకు ముందే తమ నేలకి చెందిన ఆరాధ్య దైవం కుమార స్వామి ఉత్తరాన జన్మించాడన్న కథనాన్ని చిత్ర నిర్మాతలు వెంటనే విడిచిపెట్టాలని, లేకపోతే చిత్ర బృందం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్న్ చేయడం షాకింగ్ గా మారింది.

అయితే ఇటువంటి సబ్జెక్టులు పురాణాల పరంగా త్రివిక్రమ్ కి ఎంతో అవగాహన ఉంది. సో ఎలాంటి రీసెర్చ్ లేకుండా తాను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లోకి దిగారు అనుకుంటే అవివేకం అవుతుంది. సో ఈ కాంట్రవర్సీలు అన్నిటికి చెక్ చెబుతూ మేకర్స్ ఏమన్నా క్లారిటీ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు