‘రాజమౌళి’ సినిమాలో ఆ హీరో కూడా ?

‘రాజమౌళి’ సినిమాలో ఆ హీరో కూడా ?

Published on Apr 7, 2024 7:45 PM IST

SS Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ లోనైనా మహేష్ – జక్కన్న సినిమాకి సంబంధించిన అప్ డేట్ చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐతే, ఈ సినిమా గురించి తాజాగా ఓ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని.. ఈ పాత్రలో మరో బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో అమీర్ ఖానే అని టాక్. ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్ ను ఇస్తోంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారు. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. కాగా ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే, ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు