అఖిల్‌కు జోడీగా కొత్తమ్మాయి !

Published on May 26, 2019 2:48 pm IST

అఖిల్ అక్కినేని నాల్గవ సినిమా ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు చిత్ర యూనిట్. తాజా సమాచారం మేరకు ఇందులో కొత్త హీరోయిన్ నటిస్తుందని తెలుస్తోంది. గతంలో అఖిల్ చేసిన ‘అఖిల్, హలో, మిస్టర్ మజ్ను’ సినిమాల్ని గమినిస్తే మూడింటిలోనూ ముగ్గురు కొత్త హీరోయిన్లు నటించడం జరిగింది. ఆ పంథాలోనే ఈసారి కూడా అఖిల్‌కు జోడీగా కొత్తమ్మాయినే అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. మరి ఆ అమ్మాయి ఎవరో తెలిలాంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇకపోతే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. గతంలో అల్లు అరవింద్ నాగ చైతన్య హీరోగా సుకుమార్ డైరెక్షన్లో ‘100 % లవ్’ అనే సినిమాను నిర్మించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ మాదిరిగానే ఇప్పుడు చేయబోతున్న అఖిల్ చిత్రం కూడా పెద్ద విజయం అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. భాస్కర్ గత చిత్రాల్లానే ఈ చిత్రం కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More