త్రిష పెళ్లి పై లేటెస్ట్ రూమర్ !

Published on Apr 18, 2021 12:00 am IST

సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లి పై ఎప్పుడూ ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే తన ఏకాంత వ్యక్తిగత జీవితానికి శుభం కార్డ్ పలుకుతూ త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతుందని తాజాగా మళ్ళీ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నిజానికి త్రిష పెళ్లి పై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకసార్లు వార్తలు వచ్చాయి. ఇక త్రిష వయస్సు ప్రస్తుతం 38 సంవత్సరాలు. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు అయితే లేవు.

అందుకే, కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకునేందుకు త్రిష రెడీ అయింది. మరి త్రిష నుండి పెళ్లికి సంబంధించిన మేటర్ త్వరలోనే వస్తోందేమో చూడాలి. అయితే వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌ తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయి.. చివరకు త్రిషను ఒంటరిని చేసింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా మళ్ళీ పెళ్లి గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ చాల నెలలు తరువాత త్రిష పెళ్లి అంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :