కథ ఫిక్స్.. డైరెక్టర్ కోసమే వెయిటింగ్ !

Published on Aug 2, 2021 1:41 pm IST


నట సింహం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య ఈ సినిమా తర్వాత మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రచయిత ఎమ్. రత్నం బాలయ్య కోసం ఓ కథను రాశాడని.. ఇప్పటికే బాలయ్యకి కథ కూడా వినిపించడం జరిగిందని.. రత్నం కథను బాలయ్య ఓకే చేసాడని తెలుస్తోంది.

కథలో ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఎలిమెంట్స్ ఉన్నాయట. ఇక ఈ సినిమాని హారిక హాసిని బ్యానర్ లో చేయబోతున్నాడు బాలయ్య. అయితే, ఈ సినిమాకి ఇంకా డైరెక్టర్ ను ఫైనల్ చేయలేదు. మొత్తానికి బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :