‘లూసిఫర్’కి హీరోయిన్ ఖాయం.. కానీ నిడివి ఎంత ?

Published on Jul 19, 2021 7:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ గా నయనతారను తీసుకోబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమాలో మోహన్ రాజా హీరోయిన్ పాత్రను యాడ్ చేశాడట. కాబట్టి, ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార కనిపించే అవకాశం ఉంది. కాకపోతే హీరోయిన్ పాత్ర నిడివి ఎంత ఉంటుందనేది డౌట్.

ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ లో అసలు హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యతే లేదు. కానీ మెగా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రను పెట్టారు. మరి హీరోయిన్ ను సాంగ్ కు మాత్రమే పరిమితం చేస్తారా లేక సీన్స్ లో కూడా ఇన్ వాల్వ్ చేస్తారా అనేది చూడాలి. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఇప్పటికే ఆ పాత్రలో హీరో సత్యదేవ్ ను ఎంపిక చేశారు.

సంబంధిత సమాచారం :