ఎన్టీఆర్ బయోపిక్ నుండి మరో అప్ డేట్ !
Published on Oct 10, 2018 6:00 pm IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం నుండి మరో స్టిల్ వచ్చింది. అయితే ఈ సారి ఆసక్తికరంగా ఓ పాటలోని స్టిల్ కావడం విశేషం. ‘వేటగాడు’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఆకు చాటు పింద తడిసె’ను బాలకృష్ణ – రకుల్ ప్రీత్ సింగ్ ల పై చిత్రీకరించారు. తాజాగా ఆ పాటలోని స్టిల్ ని రకుల్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.

దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న ఈ చిత్రంలో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook