పవన్ ఆ రీమేక్ చేయట్లేదట !

Published on Oct 19, 2020 7:11 pm IST


మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేయబోతోందని.. ఈ సినిమాలో రవితేజ అండ్ రానా కలిసి నటించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఈ రీమేక్ పై పవన్ ఆసక్తి చూపించాడని.. అందుకే పవన్ ను చిత్రబృందం అప్రోచ్ అయిందని, ఇప్పటికే ఈ రీమేక్ లో నటించడానికి పవన్ కూడా ఒప్పుకున్నాడని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజనే నటించబోతున్నాడని తెలుస్తోంది.

కాగా రవితేజ మరియు రానా ఇద్దరూ వచ్చే ఏడాది నుండి ఈ రీమేక్ కోసం షూట్ ప్రారంభిస్తారట.
ఒరిజినల్ వర్షన్‌ లో పోలీస్ క్యారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో రవితేజ చేయబోతున్నాడట. అలాగే మరో హీరో పాత్రలో రానా నటిస్తాడు. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను నిర్మాత సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నాక.. మొదట ఈ సినిమా బాలయ్య దగ్గరకి వెళ్ళింది. కానీ బాలయ్య ఈ సినిమా పై ఆసక్తి చూపించలేదు.

సంబంధిత సమాచారం :

More