“భీమ్లా” నుంచి కొత్త ఏడాదికి గట్టి ట్రీట్.!

Published on Nov 10, 2021 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మొదట్లో ఏమో కానీ తర్వాత ఈ సినిమాపై ఒక్కో అప్డేట్ వస్తున్న తర్వాత మాస్ లోకి ఈ సినిమా హైప్ ఎక్కడం స్టార్ట్ అయ్యింది.

ముఖ్యంగా థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ప్లస్ అయ్యింది. లేటెస్ట్ గా వచ్చిన మాస్ సాంగ్ లాలా భీమ్లా అయితే వేరే లెవెల్. మాస్ ఆడియెన్స్ అంతా ఇప్పుడు ఈ సాంగ్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ భీమ్లా సాంగ్ పై థమన్ రీసెంట్ గా ఇంకో క్రేజీ అప్డేట్ ని ఇచ్చాడు.

ఈ సాంగ్ పై డీజే వెర్షన్ ని కూడా సిద్ధం చేస్తున్నాడట. దీనిని కొత్త ఏడాది కానుకగా ఈ డిసెంబర్ 31న రిలీజ్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేసాడు. దీనితో కొత్త ఏడాది ఆరంభంకి వెల్కమ్ భీమ్లా డీజే ట్రీట్ తో దద్దరిల్లనుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More