తర్వాత “రాధే శ్యామ్” భారీ సెట్స్ లో..?

Published on Oct 30, 2020 10:00 am IST

ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న “రాధే శ్యామ్” టీం ఇటలీలో చేసిన సందడి కోసమే సినీ వర్గాల్లో మరియు అభిమానుల నడుమ చర్చ నడుస్తుంది. అక్కడి షూటింగ్ కోసం వారి మీడియా కూడా న్యూస్ వేసి మరీ చెప్పారు. అంతే కాకుండా అక్కడి ప్రభుత్వం వారు మరియు రాధే శ్యామ్ టీం పరస్పరం ధన్యవాదాలు తెలుపుకున్నారు.

అయితే ఇప్పుడు అక్కడ ప్లాన్ చేసిన షూట్ అంతా కంప్లీట్ దశకు చేరుకుంది. ఈ నెలాఖురన వీరు ఇండియాకు తిరుగు పయనం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం ఇండియాకు చేరుకున్న హైదరాబాద్ లో మిగిలిన చివరి షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయనున్నారట.

అలాగే ఈ షూట్ కు గాను ఇప్పటికే ప్రిపేర్ చేసిన భారీ సెట్స్ లో కొన్ని రోజుల పాటు పాల్గొననున్నారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా రాధా కృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More