సోమవారం సెన్సార్.. మంగళవారం ఈవెంట్ !

Published on May 26, 2019 10:00 pm IST

సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య చేస్తోన్న ఎన్.జి.కె మే 31వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. కాగా ఇప్పటికే తమిళంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్కడ ‘U’ సర్టిఫై ను తెచ్చుకుంది. ఇక తెలుగులో సోమవారం నాడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.

కాగా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు ఎన్.జి.కే మేకర్స్. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ లోని జెర్సీ కన్వెన్షన్ హల్ లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనుండగా ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More