నిహారిక పెళ్ళికి ఆహ్వానం కొందరికే..!

Published on Jul 3, 2020 3:31 pm IST

మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తన కుమార్తె పెళ్లి గురించి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్య, నిహారికల పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇది తమ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. నిశ్చితార్థం, పెళ్లి ఇలా ఏ వేడుక చేసినా ప్రభుత్వ నిబంధనలు పాటించి చేస్తామని ఆయన తెలిపారు. ఏదో హడావిడిగా పూర్తి చేయాలనుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే వివిధ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం నిహారిక, చైతన్యల నిశ్చితార్థం ఆగస్ట్ 13న జరిగే అవకాశం ఉంది.

ఐతే ఈ పెళ్ళికి చాలా కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం ఉందట. నాగ బాబు బహిరంగంగా ఈ విషయాన్ని గురించి చెప్పారు. నిహారిక పెళ్లికి సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని చెప్పడం జరిగింది. దీనికి కరోనా వైరస్ వ్యాప్తి కారణం అని తెలుస్తుంది. నిహారిక పెళ్లి ఘనంగా చేయాలని భావించినా పరిస్థితుల రీత్యా ఆయనఈ నిర్ణయం తీసుకున్నారు

సంబంధిత సమాచారం :

More