వైరల్ అవుతున్న మెగా డాటర్ వివాహ ఆహ్వాన పత్రిక.!

Published on Dec 2, 2020 7:03 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సోదరుడు మెగా బ్రదర్ మరియు ప్రముఖ నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహ మహోత్సవం ఘనంగా ఈ డిసెంబర్ 9న ఉదయ్ పూర్ రాజస్థాన్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు సహా పలువురు సన్నిహితులు హాజరు కానున్న ఈ వివాహ వేడుకకు గాను ఇప్పుడు పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి.

అయితే ఈ వివాహానికి సంబంధించి నాగబాబు చేయించిన ఆహ్వాన పత్రిక ఇపుడు సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్ అయ్యింది. ఒక బాక్స్ లాంటి దానిని డిజైన్ చేసి దానిని ఓపెన్ చేస్తే అందులో శుభ లేఖను ప్లాన్ చేశారు. అయితే ఈ బాక్స్ ను వెండి కోటింగ్ తో డిజైన్ చెయ్యడంతో సింపుల్ గానే ఉన్నా మరింత మందిని ఆకర్షితం చేసింది. మరి వివాహానికి సినీ ప్రముఖులు ఎవరెవరు హాజరు అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More