“18 పేజెస్” ఫస్ట్ గ్లింప్స్.. నిఖిల్ డైలాగ్‌లో లాజిక్ అదిరింది..!

Published on Apr 6, 2022 11:57 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “18 పేజెస్”. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇందులో ‘నాకు తెలియని ఒక అమ్మాయి చెప్పింది.. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్ ఉండకూడదు” అని నిఖిల్ చెప్పిన డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ డైలాగ్ లాజిక్ కూడా సూపర్బ్‌గా ఉందని చెప్పాలి. అంతేకాదు అనుపమ తన ప్రేమ భావాలను డైరీలో రాయడం, ఆ డైరీ నిఖిల్ కి దొరకడం, అది చదవి ఆమెతో నిఖిల్ ప్రేమలో పడడం ఆసక్తిగా అనిపిస్తుంది. ఇక అనుపమ ఇందులో ఎంతో అందంగా కనిపిస్తుండగా, నిఖిల్ మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడు. గోపీసుందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసిందని చెప్పాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :