నిఖిల్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల తేది ఖరారు!
Published on Nov 28, 2017 7:08 pm IST

విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిఖిల్ వరుస సక్సెస్ లు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పరుచుకున్నాడు. కేశవ సినిమా తరువాత కన్నడలో హిట్ అయిన కిరిక్ పార్టి సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు ఈ హీరో. రీమేక్ లో నటించడం ఈ హీరోకు ఇదే మొదటిసారి.

అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ రీమేక్‌కు చందూ మొండేటి సంభాషణలు అందించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చతున్నాడు. సంయుక్త హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్.ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి అనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ప్రీ లుక్ ను నవంబర్ 30 న ఫస్ట్ లుక్ ను డిసెంబర్ 2 న విడుదల చెయ్యబోతున్నారు.

 
Like us on Facebook