ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో నిఖిల్ “18 పేజెస్” ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్.!

Published on May 26, 2021 11:01 am IST

మన టాలీవుడ్ లో మంచి కంటెంట్ అండ్ థ్రిల్లర్ బేస్డ్ సినిమాలు అంటే గుర్తొచ్చేది యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ “స్వామి రారా” నుంచి పూర్తిగా ట్రెండ్ మార్చుకున్న నిఖిల్ అక్కడ నుంచి ఏదొక కొత్త అటెంప్ట్ తో టాలీవుడ్ ఆడియెన్స్ ని థ్రిల్స్ చేస్తూ వస్తున్నాడు. మరి అలా నిఖిల్ నటిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో “18 పేజెస్” కూడా ఒకటి. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరి ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్సమెంట్ పై అప్డేట్ ఇస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా వదిలారు. ఒక పక్క చేతిలో ఫోన్ పట్టుకొని బ్యాక్గ్రౌండ్ లో టెక్నాలజీని చూపిస్తూ మరో పక్క చేతిలో పెన్ పట్టుకొని ఒక పేజ్ పై రాస్తున్నట్టుగా సుకుమార్క్ చూపించారు. అలాగే ఇందులోనే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే జూన్ 1న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి బన్నీ వాస్ నిర్మాణం వహిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :