‘అర్జున్ సురవరం’ రాక ‘సాహో’ తరువాతే – నిఖిల్

Published on Jul 28, 2019 12:55 pm IST

యువ హీరో నిఖిల్ హీరోగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. ఆయితే నిఖిల్ కి ఈ మధ్య అసలు టైం కలిసిరావడం లేదు. ఒక పక్క తోటి హీరోలు వరుస సక్సెస్ లతో ఊపు మీద ఉంటే.. నిఖిల్ మాత్రం చేసిన సినిమాని కూడా రిలీజ్ చేసుకోలేక బాక్సాఫీస్ వద్ద వెనుకబడిపోతున్నాడు. గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సిన ‘అర్జున్ సురవరం’ సెప్టెంబర్ లేదా అక్టోబర్ కి పోస్ట్ ఫోన్ అయింది. ‘అర్జున్ సురవరం’ రిలీజ్ గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిఖిల్ స్పందిస్తూ.. సాహో తరువాతే రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశాడు.

ఏమైనా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే నిఖిల్ సినిమా రిలీజ్ అవ్వకపోవడం ఆశ్చర్యకరమే. ఇక చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమా చేయడానికి ప్రస్తుతం నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పుర్తయింది. స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి నిఖిల్ కి ‘కార్తికేయ 2’నైనా కలిసి వస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :