నిఖిల్ ‘స్పై’ నుండి రేపు బ్లాస్టింగ్ అప్ డేట్

spy
ఇటీవల కార్తికేయ 2, 18 పేజస్ సినిమాల ద్వారా రెండు మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్న యువ నటుడు నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం నటిస్తున్న స్పై. తొలిసారిగా ఆయన స్పై ఏజెంట్ గా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ తొలిసారిగా డైరెక్టర్ గా ఈ మూవీ ద్వారా మెగాఫోన్ పడుతున్నారు.

ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతోంది. ఇక తమ స్పై సినిమా నుండి రేపు బ్లాస్టింగ్ అప్ డేట్ రానుంది అంటూ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేసారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క నాన్ థియేట్రికల్ రైట్స్ ని అమెజాన్ మరియు స్టార్ నెట్వర్క్ వారు రూ. 40 కోట్లకు దక్కించుకున్నారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఆర్యన్ రాజేష్ కీలక పాత్ర చేస్తున్నారు.

Exit mobile version